2001లో 'ఇష్టం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రియ, ఆ తర్వాత 'సంతోషం', 'నేనున్నాను' వంటి సినిమాలతో గుర్తింపు పొందింది. 2003లో తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ఈమె, విజయ్, ధనుష్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
2018లో ఆండ్రీ కొచ్చీవ్ అనే విదేశీయుడిని శ్రియ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు కొంత విరామం ఇచ్చిన ఈమె, ప్రస్తుతం అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది.
ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో కూడా శ్రియ ఎంతో అందంగా కనిపిస్తూ, కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే తన సౌందర్య రహస్యం ఏమిటనేది ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరించింది.
తన మనసులో ఏ విషయాన్ని దాచుకోనని, ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తానని శ్రియ తెలిపింది. ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా మాట్లాడటమే తన అందానికి అసలైన కారణమని ఆమె భావిస్తోంది.
ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని శ్రియ చెప్పుకొచ్చింది. తన మనస్తత్వమే తన సౌందర్యానికి మూలమని ఆమె స్పష్టం చేసింది.








