బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజు సినీ తారలు సందడి చేశారు. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుక ఘనంగా జరిగింది.

'మిరాయ్' సినిమాలో నటనకు గాను తేజ సజ్జా ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలోని నటనకు గాను ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది.

అదే చిత్రంలో నటించిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ ఉత్తమ హాస్య నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకే రమణ గోగుల ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డును అందుకున్నాడు.

'కోర్టు' సినిమాకు గాను సమీరా భరద్వాజ్ ఉత్తమ నేపథ్య గాయనిగా నిలిచింది. తెలుగు, కన్నడ భాషలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో అవార్డులను స్వీకరించారు.