ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై చర్చ జరుగుతుండగా మంత్రి ఆర్‌వీ రంజిత్ కుమార్ గత ఎన్నికల వ్యూహాలను ప్రస్తావించారు. తన కాంచీపురం నియోజకవర్గంలో గతంలో ఓటుకు రూ.1,500 చొప్పున పంపిణీ చేశారని ఆరోపిస్తూ, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిని ఎటువంటి గౌరవప్రదమైన బిరుదులు లేకుండా కేవలం పేరుతోనే సంబోధించారు.

సాధారణంగా అసెంబ్లీలో కరుణానిధిని ‘కలైంజర్’ లేదా ‘మాజీ ముఖ్యమంత్రి’ అని గౌరవంగా పిలుస్తారు. మంత్రి అలా పిలవకపోవడంతో మాజీ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్తత పెరిగింది.

పరిస్థితి చేజారకుండా సీఎం సి. జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగి, కరుణానిధిని ఆ విధంగా సంబోధించడం సరైనది కాదని అంగీకరించారు. మంత్రి తరఫున తానే క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది, దీంతో మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సీఎం విజయ్ స్వయంగా క్షమాపణలు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని అభినందిస్తుండగా, మంత్రి చేతనే క్షమాపణలు చెప్పించి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.