కారేపల్లి, ఆగస్టు 25 : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ అకాల మరణం పట్ల సింగరేణి మండల నాయకులు మంగళవారం ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి, మైనార్టీ సంఘం సంక్షేమానికి తాజుద్దీన్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. తాజుద్దీన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ సింగరేణి మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జిల్లా యువజన సంఘం నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు, మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, మాజీ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, కొత్త తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ధరావత్ మంగీలాల్ లతో పాటు పలువురు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.







