బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా టైసన్ నాయుడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, తాజాగా చిత్ర యూనిట్ మొదటి పాటను బయటకు వదిలింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ జానపద పాట క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సురేష్ గంగుల ఈ పాటకి సాహిత్యం అందించగా, నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ కలిసి ఆలపించారు. ‘ఓ అచ్చం నల్ల చీర’ అంటూ సాగే ఈ పాటలో సాయి శ్రీనివాస్, నేహా శెట్టి తమదైన నృత్యాలతో అలరించారు.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మంచి విజువల్ ట్రీట్‌గా మార్చాయని మేకర్స్ తెలిపారు. విజయ్ పోలాకి ఈ పాటకు నృత్య దర్శకత్వం అందించారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు చూడని మాస్ మేకోవర్‌తో శక్తివంతమైన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కాగా, త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.








