1947 నుంచి ఇప్పటివరకు దేశం ఎన్నో విజయాలను, అపజయాలను చూసింది. అయితే, ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం యువ శక్తి జాగృతంతో కొత్త మలుపు తీసుకుంటోంది. గతంలో యువత కేవలం రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలకే పరిమితమయ్యేది, కానీ ఇప్పుడు జెన్‌జీ సంప్రదాయ బంధనాలను తెంచుకుని సొంతంగా నాయకత్వం వహించేందుకు సిద్ధమైంది.
ఢిల్లీలో జరిగిన జెన్‌జీ ఉద్యమం వ్యవస్థల కళ్లు తెరిపించింది. కేవలం ఆవేశంతో కాకుండా, సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ (చట్టంలోని నిబంధనలు) గురించి చర్చిస్తూ యువత ప్రజలను చైతన్యపరుస్తోంది. యువత సూచించిన మార్గదర్శకాలతో దేశం కొత్త దారిలో పయనిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.








