వనపర్తి టౌన్, ఆగస్టు 25 (ఆంధ్రప్రభ): వనపర్తి తొలి ఎమ్మెల్యే, తెలంగాణ వైతాళికుడు, సాహితీవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాప్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. వనపర్తిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణ సాహితీ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.

కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, కురుమూర్తి యాదవ్, ఏర్వ అరుణ శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయక్, గులాం ఖాదర్ ఖాన్, జోహెబ్ హుస్సేన్, షేక్ జహంగీర్, నీలస్వామి, బొబ్బిలి ప్రేమ్ కుమార్, వెంకట్ సాగర్, మంద రాము, చిట్యాల రాము, అరీఫ్, పాషా, వెంకటేష్ యాదవ్, ఏంట్ల శ్రీను, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.