సుమంత్ తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో 'మళ్లీ రావా', 'అనగనగా' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన కమర్షియల్ అంశాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా 'న్యూటన్స్ థర్డ్ లా', 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలతో ఆయన సిద్ధమవుతున్నారు.

నారా రోహిత్ కూడా తన కెరీర్ ప్రారంభంలో మంచి కథలతో గుర్తింపు పొందారు. మధ్యలో కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు 'కపాలి', 'సౌండ్ ఇంజనీర్' చిత్రాలతో మళ్లీ బిజీ అయ్యారు. అంతేకాకుండా వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

'నాంది' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అల్లరి నరేష్, మధ్యలో రేసులో వెనకబడ్డారు. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటూ 'రంభ ఊర్వశి మేనక', 'ఆల్కహాల్' వంటి సినిమాలతో వస్తున్నారు. సెప్టెంబర్ 4న సోషియో ఫాంటసీ నేపథ్యంలో 'రంభ ఊర్వశి మేనక' విడుదల కానుండగా, 'ఆల్కహాల్' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ హీరోలంతా తమ కెరీర్‌లో వేగం పెంచుతూ, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.