POCO M8x 5G: భారత మార్కెట్లో పోకో (POCO) నుండి కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్ POCO M8x 5Gను అధికారికంగా విడుదల అయ్యింది. ఎంట్రీ-టు-మిడ్ రేంజ్ విభాగంలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, మెరుగైన పనితీరు, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందించింది. ఎక్కువ కాలం బ్యాటరీ బ్యాకప్‌తో పాటు సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌పై కంపెనీ దృష్టి పెట్టింది.

POCO M8x 5Gలో 7,900mAh బ్యాటరీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది. సాధారణ వినియోగంలో మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదని కంపెనీ పేర్కొంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 30 నిమిషాల్లో సుమారు ఒక రోజు వినియోగానికి సరిపడా ఛార్జింగ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇది కలిగి ఉంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించారు. 4nm తయారీ ప్రక్రియపై రూపొందిన ఈ చిప్‌సెట్ యాప్‌లను వేగంగా ఓపెన్ చేయడంతో పాటు మెరుగైన పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌లో LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. 6GB ర్యామ్ వేరియంట్‌లో 6GB వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ట్రిపుల్ కూలింగ్ సిస్టమ్ ను అందించారు. ఇందులో 12,439 చదరపు మి.మీ. అల్ట్రా-లార్జ్ గ్రాఫైట్ షీట్, 1,924 చదరపు మిల్లీమీటర్ల కాపర్ ఫాయిల్ లేయర్, 3.5W హై-ఎఫిషియెన్సీ థర్మల్ జెల్ ఉన్నాయి. ఎక్కువసేపు గేమింగ్ లేదా ఇతర పనులు చేసినప్పుడు పనితీరు స్థిరంగా ఉండేందుకు ఈ కూలింగ్ వ్యవస్థ సహాయపడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. TÜV Rheinland నుంచి లో బ్లూ లైట్, సర్కేడియన్ ఫ్రెండ్లీ, ఫ్లికర్-ఫ్రీ వంటి మూడు సర్టిఫికేషన్లు కూడా లభించాయి. ఇక మొబైల్ ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్ ఉన్నాయి. 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ ద్వారా సాధారణ స్థాయి కంటే ఎక్కువ శబ్దాన్ని పొందే అవకాశం ఉంది.

వెనుక భాగంలో 50MP AI మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి 2x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్ ఉంది. ఫ్లికర్ సెన్సార్, LED ఫ్లాష్ కూడా ఉన్నాయి. ఈ కెమెరాతో 1080p వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇది f/2.0 అపెర్చర్‌తో పాటు 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

POCO M8x 5G ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3తో వస్తుంది. ఇందులో హైపర్ ఐలాండ్ డైనమిక్ నోటిఫికేషన్స్, క్రాస్-డివైస్ ఇంటర్‌కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ వంటి AI టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరంగా POCO నాలుగు తరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ మొబైల్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్‌కు IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, GLONASS, USB Type-C కనెక్టివిటీ కూడా ఉన్నాయి.

భారత్‌లో పోకో M8x 5G 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్ గ్రీన్ కలర్‌లో వీగన్ లెదర్ బ్యాక్‌తో పాటు కోబాల్ట్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు కొనుగోలుపై రూ.2,000 కూపన్ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.

🚨 POCO M8x 5G LAUNCHES IN INDIA TODAY! 🇮🇳🔥

POCO is launching it's new M-series phone TODAY at 12 PM.

📱 6.9" 120Hz display⚡ Snapdragon 4 Gen 5🔋 7,900mAh battery📸 50MP main camera📱 5G support🛡️ Tough build💾 Up to 8GB RAM reportedly