ప్రస్తుత జీవనశైలిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు నిరంతరం టెన్షన్ మరియు ఆందోళనతో పనులు చేస్తున్నారు. ఇలా ఎక్కువ సేపు ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని అమెరికాకు చెందిన ఒక అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా ఫోన్లకు బానిసలై, ఇళ్లకే పరిమితం కావడం వల్ల తెలియని మానసిక సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడటం లేదా స్కూలు, కాలేజీల్లో స్నేహితులతో గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేది. ఇప్పుడు బయటకు వెళ్లే అవకాశం లేక స్నేహితులతో కలవకపోవడం వల్ల చాలామంది మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్నేహితులతో కాసేపు సరదాగా గడిపితే మనసు రీసెట్ అవుతుందని, ఒత్తిడి దూరం అవుతుందని అధ్యయనం పేర్కొంది.
స్నేహితులతో టచ్‌లో ఉండటానికి ఫోన్ ద్వారా మాట్లాడటం లేదా నేరుగా కలవడం వంటి మార్గాలు ఉన్నాయి. నేరుగా కలవాలనుకున్నప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్న చోట కలుసుకోవాలి. కష్టాల గురించి కాకుండా, మనసుకు ఉల్లాసాన్నిచ్చే కబుర్లు చెప్పుకోవడం వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది.







