హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల యూనిఫాం నాణ్యతపై ఏకపక్ష నిర్ణయాలను తిరస్కరించారు. 'పేద పిల్లల భవిష్యత్తు కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. అలసట్వం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు' అని హెచ్చరించారు.
దుస్తుల కుట్టడం, సరఫరా ప్రక్రియలో ఏజెన్సీలపై ఒత్తిడి పెంచాలని ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి యూనిఫాంలు చేరేలా గడువు విధించారు. గత ప్రభుత్వం యూనిఫాం విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినట్లు సూచించారు.
వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు సిద్ధంగా ఉండేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. ప్రతి విద్యార్థి నుంచి యూనిఫాం ఫిట్, నాణ్యతపై అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా పంపిణీ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.








