అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. వడ్డెర సత్రంలో ౧౧వ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సత్రం డోర్లను బలవంతంగా ఓపెన్ చేశారు. గదిలోని హాలులో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు మహిళలు స్నానాల గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మకూరు డిఎస్‌పి రామాంజనేయులు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతులు అనంతపురం జిల్లా బతల్లపల్లి వాసులు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)లుగా గుర్తించారు. సుధాకర్ తన నలుగురు కుటుంబం సభ్యులతో కలిసి గత నెల 28న శ్రీశైలంకు వచ్చారు. వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని తీసుకొని ఉంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






