యాలాల: కంది, వరి, పత్తి పంటల సాగులో రైతులు శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త భారతి అన్నారు. శుక్రవారం మండలంలోని చెన్నారం గ్రామంలో ఏఈఓ గోపితో కలిసి పొలాలను పరిశీలించారు. కందిలో పెటోత్పెర బ్లెట్‌ తెగులు నివారణకు మెటలాక్సిల్‌ 2.5 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎండుతెగులు నివారణకు శాప్‌ మిశ్రమాన్ని లీటరు నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ శివకుమార్‌, రైతులు వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బషీరాబాద్‌: అధికారుల దాడిలో పట్టుబడిన ఇసుకకు శుక్రవారం బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వేలం నిర్వహించారు. నలుగురు వ్యాపారులు పోటీపడ్డారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఏడాదిగా నిల్వ ఉంచిన సుమారు 15 ట్రాక్టర్ల ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.1.03 లక్షలకు అమ్ముడైంది. కొర్విచెడ్‌ సర్పంచ్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎక్మాయికి చెందిన మోహన్‌, బషీరాబాద్‌కు చెందిన జమీర్‌, తాండూరుకు చెందిన ఎం.శ్రీనివాస్‌ బిడ్లు వేశారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎం.శ్రీనివాస్‌ రూ.1,03,000కు ఇసుక డంపును సొంతం చేసుకున్నారు. వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.1,19,200 ఆదాయం సమకూరిందని తహసీల్దార్‌ షాహె దా బేగం తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

దౌల్తాబాద్‌: మండలంలోని బాలంపేట గ్రా మానికి చెందిన బి.నర్సింలు ఈ నెల 13న తిరుమలకు వెళ్లాడు. స్వామివారినిదర్శించుకున్న తర్వాత 15వ తేదీ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛా ఫ్‌ అయ్యింది, ఎనిమిది రోజులుగా నర్సింలు జాడ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింలు ట్రా న్స్‌కోలో ఆర్టి జన్‌ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన అదృశ్యంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అనంతగిరి: ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా సుధీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింలు, జిల్లా నాయకులు హనుమంతు, గణేశ్‌, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.