ఆగస్టు 15న మొదలై ఆగస్టు 30 వరకు సాగే ఈ అంతర్జాతీయ హాకీ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, మలేసియా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
జట్లను నాలుగు పూల్స్‌గా (గ్రూపులుగా) విభజించగా, పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు పూల్-డిలో ఉన్నాయి. ఇదే గ్రూపులో ఇంగ్లండ్, వేల్స్ జట్లు కూడా ఉన్నాయి. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఆగస్టు 19న జరగనుంది.
మహిళల విభాగంలో భారత్, చైనా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు పూల్-డిలో పోటీ పడుతున్నాయి. టోర్నీలో భాగంగా మహిళల ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 29న నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్‌లో, పురుషుల ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 30న బెల్జియంలోని వావ్రేలో జరుగుతాయి.
ఫైనల్స్‌కు ముందు మహిళలు, పురుషుల విభాగాల్లో కాంస్య పతకం కోసం జట్ల మధ్య పోరు ఉంటుంది. ఈ మెగా టోర్నీ ముగింపుతో విజేతలు ఎవరో తేలనున్నారు.






