శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు లవ్‌నీత్ సిసోడియా 27 పరుగులు, మనీష్ పాండే 29 పరుగులతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
కర్ణాటక ఇన్నింగ్స్‌ను కరుణ్ నాయర్ 53 పరుగులతో ముందుకు నడిపించగా, చివర్లో ప్రవీణ్ దూబే 30 పరుగులతో మెరుపులు మెరిపించాడు. బెంగాల్ బౌలర్లలో సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీయగా, ప్రదీప్త ప్రామాణిక్, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
బెంగాల్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ 56 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు.
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది. సుదీప్ కుమార్ ఘరామి 65 పరుగులు, షాబాజ్ అహ్మద్ 56 పరుగులతో హాఫ్ సెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు.
కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు తీసి బెంగాల్‌ను దెబ్బతీశాడు. ఈ విజయంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 టోర్నీని కర్ణాటక జట్టు విజయంతో ప్రారంభించింది.








