Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ. 61,328 ధరకు అందుబాటులో ఉంది. గత ఏడాది జనవరిలో ఈ ఫోన్ రూ. 80,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. అంటే, ఇప్పుడు ఈ ఫోన్ సుమారు రూ. 22,000 తక్కువ ధరకే వినియోగదారులకు లభిస్తోంది.

అదనంగా, PNB లక్సురా క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 58,828కి తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వినియోగదారులు మరిన్ని అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు.

ఈ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ పనితీరు కోసం ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు.

కెమెరా విషయానికి వస్తే, వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 10MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 12MP కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇందులో 4,000mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.2 USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 162 గ్రాముల బరువుతో, 7.2 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది.