రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన విజయ్ వర్మ 1978లో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబం తీవ్ర పేదరికంలోకి వెళ్లింది. ఆకలి తీర్చుకోవడానికి అన్నదమ్ములు ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లారు.
పూణేలో రైల్వే స్టేషన్ వద్ద ఆశ్రయం పొందుతూ, విజయ్ వడా పావ్ అమ్మే వ్యక్తి దగ్గర గిన్నెలు కడిగే పనిలో చేరారు. ఆ పనికి ఆయనకు రోజుకు కేవలం రూ.3 మాత్రమే జీతం వచ్చేది. ఆ తర్వాత భవన నిర్మాణ రంగంలో టైలింగ్, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ వంటి పనుల్లో నైపుణ్యం సంపాదించారు.
ప్రముఖ బిల్డర్ విమల్ కుమార్ జైన్ వద్ద పని చేసే అవకాశం దక్కించుకున్న విజయ్, 15 రోజుల పనిని కేవలం 8 రోజుల్లోనే పూర్తి చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. నేడు ఆయన కంపెనీ విలువ రూ.160 కోట్లకు చేరుకుంది.








