రామాయణ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ట్రైలర్ విడుదల కాకముందే స్కూల్స్, అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో సినిమా గురించి ప్రచారం చేసిన బృందం, ఇప్పుడు థియేటర్ యజమానుల కోసం నిర్వహించే బిగ్ సినీ ఎక్స్‌పో 2026పై దృష్టి పెట్టింది.
ఈ ఎక్స్‌పోలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను ప్రదర్శించనున్నారు. బయట ప్రపంచానికి ఇంకా తెలియని కీలకమైన విజువల్స్‌ను కేవలం ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతినిధులు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
ఈ వీడియో లీక్ కాకుండా ఉండేందుకు నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్‌పోలో పాల్గొనే వారు ఎలాంటి రికార్డింగ్ చేయకుండా ప్రత్యేక సెక్యూరిటీని నియమిస్తున్నారు. గతంలో బ్రహ్మాస్త్ర, మైదాన్, బేబీ జాన్ వంటి సినిమాల ఫుటేజ్‌ను కూడా ఇలాగే ప్రదర్శించారు.
సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల రంగంలోని ప్రముఖులు మాత్రమే ఈ ప్రత్యేక దృశ్యాలను చూసే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను దివాళి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.








