దర్శకుడు సుబ్బారెడ్డి తన బ్యానర్ కింద 2023లో ‘వారణాసి’ టైటిల్ రిజిస్టర్ చేసుకుని, ఆ ప్రాజెక్ట్ కోసం పని ప్రారంభించారు. కానీ తెలుగు సినిమా ప్రతిష్ట దృష్ట్యా రాజమౌళి-మహేష్-కేఎల్ నారాయణ చిత్రానికి ఈ టైటిల్ అవసరమైంది తెలిసిన తర్వాత, ఏ ప్రతిఫలం ఆశించకుండా దానిని విడిచిపెట్టారు.
ఇది వ్యాపార లావాదేవీ కాదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. “టైటిల్ ఒక ఎమోషన్, దాన్ని అమ్మడానికి కాదు. మంచి సినిమా కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు. దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ, సుబ్బారెడ్డి భావోద్వేగపూరిత నిర్ణయం పరస్పర సహకారానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
ఈ చర్య పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించుతుందని వీరశంకర్ ప్రశంసించారు. రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తమ శుభాకాంక్షలు తెలియజేయడంతో ‘వారణాసి’ చిత్రం తెలుగు సినిమా ప్రపంచ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఆశిస్తున్నారు.








