ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లోకి కప్స్టన్ సర్వీసెస్ అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో కొత్తగా కప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి ఆర్ నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో నటుడు అక్కినేని నాగార్జునను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా వివిధ సంస్థలకు మానవ వనరుల పరిష్కార సేవలను అందించడంలో కప్స్టన్ సాధించిన నమ్మకంపై నాగార్జున ప్రశంసలు కురిపించారు.
గత 17 ఏళ్ల కార్యాచరణ అనుభవం, శిక్షణ పొందిన సిబ్బంది, సాంకేతికతతో కూడిన సేవా నిర్వహణను వినియోగదారుల విభాగంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన హోమ్ సర్వీసెస్ బ్రాండ్‌ను నిర్మించే దిశగా హైదరాబాద్‌ను ప్రారంభ వేదికగా ఎంచుకున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి వెల్లడించారు.








