రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలా వద్దా అనే అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం ఆగష్టు 5న పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది.
ఈ సమావేశం ముగిసిన వెంటనే పార్టీ అధ్యక్షుడు అభీజీత్ డిప్కే విలేకరుల సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. రాజకీయ ప్రవేశంపై పార్టీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కోర్ కమిటీ భేటీ అనంతరం అభీజీత్ డిప్కే వెల్లడించే వివరాల ఆధారంగా పార్టీ తదుపరి కార్యాచరణ ఉండనుంది.







