మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతుల రద్దుపై కాంగ్రెస్ అనవసర రా జకీయ రాద్ధాంతం చేయడం మానుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్‌రావు హితవు చెప్పారు. గతంలో సీఎంలు తరుణ్ గొగోయ్, అర్జున్ ముండా విదేశీ పర్యటనలను కేంద్రం తిరస్కరించిందని ఆయ న తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ లోగడ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళాలనుకున్నప్పుడు వీసా రాకుండా కాంగ్రెస్ కు ట్ర చేసి లేఖలు రాసిందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు. సీ ఎం ప్రతినిధి బృందానికి పెట్టుబడుల సమావేశాలకు అనుమతులు ఇచ్చినా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ) పొలిటికల్ క్లియరె న్స్ ఇవ్వకపోవడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని ఆయ న తెలిపారు. సీఎంతో పాటు వెళ్లే అధికారుల ప్రతినిధి బృందానికి పెట్టుబడులు,ఒప్పందాల కోసం సమావేశాలు నిర్వహించుకోవడాని కి ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.
రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సం స్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రోటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆ యన వివరించారు. ఇకపోతే గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012 లో నాటి అస్సాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ అమెరి కా, ఇజ్రాయెల్ పర్యటనలను, అదేవిధంగా జార్ఖండ్‌కు బిజెపి సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా నా డు గుజరాత్ ము ఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీ లు, నాయకులు కుట్రపూరితంగా లేఖలు రాసిన చరిత్రను ఉందని ఆయన దుయ్యబట్టారు. సిఎం రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాం టి అడ్డంకులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల లోపాల ప్రకారమే నిర్ణయం జరిగిందని, దీనిని రాజకీయం చేయవద్దని రాంచందర్‌రావు హెచ్చరించారు.
నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబిబిఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆ యన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల కోర్సు ఫీజును ఐదు వాయిదాలలో చెల్లించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టిఏఎఫ్‌ఆర్‌సి) నిర్దేశించినప్పటికీ, కొన్ని ప్రైవే ట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.13 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అదనపు భారం మోపాయని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వాపస్ చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి గారితో పాటు హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పులిచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఇఎంఇ) తక్షణమే జోక్యం చేసుకుని ఆయా ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థులకు ఫీజులు రీఫండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని ఆయన భరోసా ఇచాఇ్చరు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయేందర్, డాక్టర్ ప్రమో ద్ బిజెపిలో చేరారు. రాంచందర్‌రావు వారికి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.








