తేనేపల్లిలోని టి.రంగంపేట ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్యం తన అల్లుడు అశోక్‌ను ఆన్‌లైన్ గేమ్ ఆడవద్దని, జూదానికి బానిస కావద్దని మందలించారు. దుబాయ్‌లో ఉద్యోగం చేసే అశోక్, సెలవుపై భార్య పిల్లలతో కలిసి మామగారి ఇంటికి వచ్చారు.
తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అశోక్ ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా సుబ్రహ్మణ్యం గమనించారు. ఉదయం పూట అల్లుడిని మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో అశోక్ తన మామపై పిడిగుద్దులతో దాడి చేశారు.
ఈ దాడిలో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన తర్వాత అశోక్ అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యులు వచ్చేలోపే అశోక్ కనిపించకుండా పోయారు.
ఈ ఘటనపై పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.







