POCO సంస్థ తన సరికొత్త POCO M8x 5G స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. గ్రీన్ కలర్ టెక్స్చర్డ్ ఫినిషింగ్, గోల్డ్ కలర్ ఫ్రేమ్ మరియు కెమెరా మాడ్యూల్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఫోన్ కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్లను అమర్చారు.
కెమెరా పిక్సెల్స్, ప్రాసెసర్ మరియు బ్యాటరీ సామర్థ్యం వంటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అధికారిక లాంచ్ డేట్‌తో పాటు మిగిలిన ఫీచర్లను కంపెనీ ప్రకటించనుంది.
ఇటీవల POCO సంస్థ M8 పవర్ వేరియంట్‌ను రూ. 24,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త POCO M8x 5G మోడల్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉండనున్నాయనేది త్వరలో తెలియనుంది.







