మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. సంతోష (26) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శనివారం రాత్రి తన నివాసంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
సంతోష పోచారంలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.








