అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. విశాల్‌కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్‌ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.

కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్‌ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్‌లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్‌ చేసిన నచ్చావు మచ్చాన్‌ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.