రోజువారీ ఆహారంలో పండ్లు చేర్చుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. జామపండు, అరటిపండ్లలో ఏది మెరుగైనది అనే ప్రశ్న చాలామందికి గందరగోళంగా ఉంటుంది.
జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒకటి తిన్నా శరీరానికి అవసరమైన విటమిన్ సి కంటే రెట్టింపు లభిస్తుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. క్యాలరీలు తక్కువ. అరటిపండులో పొటాషియం ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యం, మాంసల నియంత్రణకు సహాయపడుతుంది. కానీ క్యాలరీలు, చక్కెర ఎక్కువ.
డయాబెటిస్ ఉన్నవారికి జామపండు మంచి ఎంపిక. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అరటిపండు తినే వారికి కిడ్నీ సమస్యలు ఉంటే జాగ్రత్త. వర్కౌట్ చేసేవారికి అరటిపండు శక్తినిస్తుంది.








