ఒప్పో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్‌ల ధరలు అధికమవ్వడం మరియు సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా ఈ ధరల సవరణ జరిగింది. ఈ కొత్త ధరలు ఇప్పటికే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమల్లోకి వచ్చాయి.

ఒప్పో K14 సిరీస్‌లో ధరల పెంపు గమనిస్తే, 6GB + 128GB మోడల్ ధర రూ. 19,999 నుంచి రూ. 21,999కి చేరింది. అలాగే 6GB + 256GB వేరియంట్ రూ. 21,999 నుంచి రూ. 24,999కి పెరిగింది. అత్యధికంగా 8GB + 256GB టాప్ మోడల్ ధర రూ. 23,999 నుంచి రూ. 27,999కి పెరిగి, రూ. 4,000 మేర ప్రియమైంది. ఒప్పో K14x ఫోన్ల ధరలను కూడా రూ. 1,000 మేర పెంచారు; ఇందులో 4GB + 64GB మోడల్ ధర రూ. 16,999గా ఉండగా, 6GB + 128GB వేరియంట్ రూ. 20,999కి అందుబాటులో ఉంది.

ఇక ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే, 4GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999 నుంచి రూ. 21,999కి పెరిగింది. దీనిలోని 6GB + 128GB వేరియంట్ ధరపై రూ. 2,000 పెరగడంతో, ఇప్పుడు అది రూ. 24,999కి చేరింది. ఈ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.