Spotify సహ వ్యవస్థాపకుడు Daniel Ek, Hjalmar Nilsonne కలిసి ఈ Neko Health సంస్థను స్థాపించారు. వీరు అభివృద్ధి చేసిన బాడీ స్కానింగ్ టెక్నాలజీ, రక్త పరీక్షలు, ఫిట్‌నెస్ పరికరాల నుంచి వచ్చే డేటాను కలిపి ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని అంచనా వేస్తుంది.

ప్రస్తుతం ఈ సేవలు స్వీడన్, యూకే దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో అడుగుపెట్టిన ఈ సంస్థ సేవలను పొందడానికి ఇప్పటికే 25,000 మందికి పైగా న్యూయార్క్ వాసులు వెయిటింగ్ లిస్టులో చేరారు.

టెక్ రంగంలోని వ్యవస్థాపకులు లేదా వెంచర్ క్యాపిటలిస్టులు — అంటే కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు — మద్దతు ఇస్తున్న హెల్త్ స్కానింగ్ కంపెనీలలో Neko Health ఒకటి. ఈ స్టార్టప్ ఇప్పటివరకు 700 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.