ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్, ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు సహా పలు ప్రధాన భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

1999 నాటి కార్గిల్ యుద్ధం, భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల పోరాటాన్ని ఈ సిరీస్ కళ్లకు కట్టింది. యుద్ధ సమయంలో పైలట్ అధికారులు ఎదుర్కొన్న అంతర్గత సంఘర్షణలు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల జీవితాలను ఇందులో ఎమోషనల్‌గా చూపించారు. జిమ్మీ షెర్గిల్, సిద్ధార్థ్, అభయ్ వర్మ, దియా మీర్జా, మహేష్ మంజ్రేకర్ వంటి నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సిరీస్ నిర్మాణానికి 115 రోజుల సమయం పట్టింది. పటియాలా, న్యూఢిల్లీ, ముంబై, మనాలి, గ్వాలియర్, చండీగఢ్ వంటి 11 నగరాల్లో చిత్రీకరణ జరిపారు. సుమారు 200 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, 4000 మంది రోజువారీ కూలీలు ఈ ప్రాజెక్టులో పనిచేశారు. అలాగే, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం నెట్‌ఫ్లిక్స్ 15 భారతీయ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి సానుకూల స్పందనలను అందుకుంటోంది.