థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, నాని అభిమానులను, ఇతర సినీ ప్రియులను ఈ చిత్రం సంతృప్తి పరచలేకపోయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఈ సినిమాను పూర్తిస్థాయిలో సిద్ధం చేయకుండానే విడుదల చేశారని చాలా మంది విమర్శించారు.

ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో నాని సరసన కాయడు లోహర్ హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

సినిమాలో విలన్ పాత్రల్లో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కనిపించారు. అలాగే నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి, స్నేహితుడి పాత్రలో సంపూర్ణేష్ బాబు నటించారు.

ఓటీటీలో విడుదలైనప్పుడు సినిమా నిడివి గణనీయంగా తగ్గుతుందని ప్రేక్షకులు భావించారు. అయితే, థియేటర్ వెర్షన్ నుంచి కేవలం నాలుగు నిమిషాల సన్నివేశాలను మాత్రమే తొలగించారు.

ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో, అలాగే ఏయే సన్నివేశాలను తొలగించారో చూడాలి.