నేషనల్ కేనూ స్ప్రింట్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కేనూ స్ప్రింట్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనతో మెరిసింది. ఈ పోటీల్లో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారిణులు వివిధ ఈవెంట్లలో వరుసగా వెండి పతకాలను సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారు.

వ్యక్తిగత విభాగంలో కేనూ సింగిల్ ఈవెంట్‌లో నె. బిందు వెండి పతకాన్ని గెలుచుకోగా, ఇదే విభాగంలో కె. అనుషా కూడా వెండి పతకాన్ని సాధించింది. ఇక జంటగా పాల్గొన్న కేనూ డబుల్ ఈవెంట్‌లో పి. జస్విక, కె. అనుషా జోడీ వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. మరో డబుల్ ఈవెంట్‌లో ఎం. బిందు, పి. జస్విక జోడీ కూడా వెండి పతకంతో మెరిసింది.

జట్టు విభాగంలో కేనూ ఫోర్ ఈవెంట్‌లో కె. బిందు, పి. జస్విక, ఆర్. రేఖ, కె. అనుషా కలిసి వెండి పతకాన్ని గెలుచుకున్నారు. ఇలా పలు విభాగాల్లో పతకాలను సాధించిన క్రీడాకారిణుల ప్రతిభను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ప్రత్యేకంగా అభినందించింది.