‘మొగలిరేకులు’ సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందిన శిరీష, యాంకర్ కమ్ నటుడు మహేందర్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ శుభవార్తను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన శిరీషకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వారు కూడా సీరియల్స్‌లో నటించినప్పటికీ, శిరీష వారికి మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె ‘రాములమ్మ’, ‘స్వాతి చినుకులు’, ‘మనసు మమత’, ‘చెల్లెలి కాపురం’, ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ‘త్రిశూలం’ వంటి పలు సీరియల్స్‌లో నటించారు.

శిరీషకు గతంలో నవీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తన భర్తతో విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితమే ఆమె ప్రకటించారు.

ఇక శిరీషను వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికి వస్తే, ఆయన తన కెరీర్‌ను ఆర్జే (రేడియో జాకీ)గా ప్రారంభించారు. ఆ తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ వంటి సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.