నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సౌండ్ ఇంజనీర్'. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా పేరును అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి చినిమిల్లి మణికుమార్ కథ అందించి, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో నయన్ సారిక, నరేష్ విజయ కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భరత్ చౌదరి ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన వీడియోలో, నారా రోహిత్ పోషిస్తున్న పాత్రకు వినికిడి సమస్యలు ఉన్నట్లు చూపించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.