ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ సెప్టెంబర్ 3 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స (Surgery) కారణంగా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, సినిమా పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, సెప్టెంబర్ 3 నుంచి మొదలయ్యే షెడ్యూల్‌లో ఎన్టీఆర్ అవసరం లేని చిన్ననాటి సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తారు.
ఈ బ్యాలెన్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత, సెప్టెంబర్ మూడో వారం నుంచి ఎన్టీఆర్ స్వయంగా షూటింగ్ సెట్స్‌లో పాల్గొంటారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








