హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన విష్ణువర్ధన్, గురువారం ఉదయం అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
విష్ణువర్ధన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతని సోదరుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.








