సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా తన కుమారుడు కౌశిక్ పుట్టినరోజును సోషల్ మీడియాలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఈ వేడుకలో రోజా, దర్శకుడు ఆర్.కే. సెల్వమణి, వారి ఇద్దరు పిల్లలు అన్షుమాలిక, కౌశిక్ కలిసి కేక్ కట్ చేసి ఆనందించారు.
ఈ సందర్భంగా రోజా తన సోషల్ మీడియా ఖాతాలో పుట్టినరోజు ఫోటోలను షేర్ చేస్తూ కుమారుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 'నువ్వు ఎప్పటికీ నా చిన్నారి బాబువే' అనే భావోద్వేగ సందేశంతో పాటు, కౌశిక్ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. రోజా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ాయి.
అభిమానులు, నెటిజన్లు కౌశిక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్య రోజా తన కుమార్తె అన్షుమాలిక విజయాలను, కుటుంబ సందర్భాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు కుమారుడి పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేయడం ద్వారా అభిమానుల మనసులను గెలుచుకున్నారు.








