మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన మనవడు వాయువ్ తేజ్ కొణిదెల ఫొటోను తొలిసారిగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో వాయువ్ తేజ్.. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న పాత ఫొటోను ఆసక్తిగా గమనిస్తూ కనిపిస్తున్నాడు.
ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ నాగబాబు తన మనవడిపై ప్రేమను వ్యక్తం చేశారు. "మా బుజ్జిబాబు చరిత్రను తదేకంగా చూస్తున్నాడు, తన పరిశీలనతో మెగా వారసత్వం కొనసాగుతుంది" అని ఆయన రాసుకొచ్చారు. ఇంతకుముందు వాయువ్‌కు సంబంధించిన ఫొటోలను కుటుంబ సభ్యులు బయటకు తీసుకురాలేదు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు 2023లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరికి 2025 సెప్టెంబర్ 10న కుమారుడు జన్మించగా, అతడికి వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టారు.
ఇటీవల జరిగిన ఒక సినిమా సక్సెస్ మీట్‌లో చిరంజీవి కూడా వాయువ్ గురించి మాట్లాడారు. వరుణ్ తేజ్ కుమారుడిని తమ కుటుంబానికి లక్కీ చార్మ్ (అదృష్టాన్ని తెచ్చే వ్యక్తి) అని చిరంజీవి పేర్కొన్నారు.






