మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కళాశాల అడ్మిన్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, అదే కళాశాల మహిళా ప్రిన్సిపాల్‌తో కలిసి కార్యాలయంలో అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో కార్యాలయంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేయగా, వీరిద్దరి అసభ్యకరమైన చర్యలు రికార్డయ్యాయి.
ఈ వీడియోలు బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి పనులకు పాల్పడటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు భజరంగ్ దళ్ విద్యార్థి విభాగం నాయకులు కూడా కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అడ్మిన్ సుబ్బారెడ్డి వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేయడంతో, ఆయన రాజీనామా చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నిరసనకారులు కోరుతున్నారు. చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








