సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వల్ల పిల్లల ఆరోగ్యం, వ్యసనాలపై ప్రభావం పడుతోందన్న కేసులో న్యూ మెక్సికో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇందులో భాగంగా మెటా కంపెనీ 567 మిలియన్ డాలర్ల జరిమానాను చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. గతంలో విధించిన జరిమానాలతో కలిపి మొత్తం 942 మిలియన్ డాలర్లను మెటా చెల్లించాల్సి ఉంటుంది.

కేవలం జరిమానా మాత్రమే కాకుండా, న్యూ మెక్సికో రాష్ట్రంలో తమ ప్లాట్‌ఫామ్‌లలో మెటా కొన్ని మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది. ప్లాట్‌ఫామ్‌లపై 'లైక్' కౌంట్‌ను తొలగించాలని కంపెనీకి సూచించింది. అలాగే, మైనర్ల కోసం పంపే పుష్ నోటిఫికేషన్లపై కూడా ఆంక్షలు విధించింది.

కొత్త నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మైనర్లకు పుష్ నోటిఫికేషన్లు పంపకూడదు. అంతేకాకుండా, నెలకు 90 గంటలకు మించి పుష్ నోటిఫికేషన్లను పంపే వీలు లేకుండా పరిమితులు విధించాలని కోర్టు ఆదేశించింది.

ఈ తీర్పుపై మెటా స్పందించింది. కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.