దర్శకుడు మణిరత్నం తన తదుపరి సినిమా కోసం విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను ఎంపిక చేశారు. ప్రస్తుతం కోల్‌కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జిపై ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి తన గత చిత్రాలకు భిన్నంగా కొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు. ఆయన చాలా ట్రిమ్‌గా మారి ఈ పాత్ర కోసం సిద్ధమయ్యారు. మరోవైపు సాయి పల్లవి తన నటన, అందంతో ప్రేక్షకులను అలరించనున్నారు.

హౌరా బ్రిడ్జిపై జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్‌లో ఒక రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.