సిఐఎస్‌సిఇ స్పోర్ట్, గేమ్స్ (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ క్రీడలు) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రి సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నాసర్ స్కూల్ (గచ్చిబౌలి), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ (హెచ్‌పిఎస్) జట్లు సెమీ ఫైనల్ దశకు చేరుకున్నాయి. బాలుర అండర్17 విభాగంలో ఈ రెండు జట్లు తమ ప్రదర్శనతో ముందుకు సాగాయి.

లీగ్ దశలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన ఈ నాలుగు జట్లు సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న నాసర్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి.

గురువారం నాసర్ స్కూల్, హెచ్‌పిఎస్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు జరగనుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ పాట్రిక్ హైస్కూల్, షేర్‌వుడ్ స్కూల్ జట్లు ఒకదానికొకటి తలపడతాయి.