కుమురం భీం ఆసిఫాబాద్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని సదస్సులో తీర్మానించారు.
కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా లేబర్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ, సింగరేణి కాలరీస్ వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సదస్సులో చర్చించారు. ఈ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.








