ఈ ఏడాది కరుప్పు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూర్య, ప్రస్తుతం తన తదుపరి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే సూర్య ఈ ఏడాది తన మూడవ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ కొత్త సినిమాకు ఆవేశం సినిమాతో గుర్తింపు పొందిన జిత్తు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత సూర్య ఈ చిత్రంలో పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టులో నజ్రియా, నస్లెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే, ఈ సినిమా కథాంశం గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పుకారు చక్కర్లు కొడుతోంది. ఇందులో సూర్య అంధుడైన పోలీసుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక కేసును విచారిస్తున్న సమయంలో హీరో తన కంటి చూపును కోల్పోతారని, ఆ తర్వాత ఏళ్ల గ్యాప్ ఇచ్చి మళ్లీ అదే కేసును రహస్యంగా ఛేదించడానికి వస్తారని కథనం వినిపిస్తోంది.
ఈ కథాంశంపై అభిమానుల్లో ఇప్పటికే భారీగా ఆసక్తి పెరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అధికారికంగా చిత్ర బృందం నుంచి సమాచారం వచ్చే వరకు ఈ పుకారు నిజమో కాదో వేచి చూడాల్సిందే.








