దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం KJQ. కింగ్, జాకీ, క్వీన్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు కేకే అనారోగ్యంతో మరణించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

తాజాగా విడుదలైన ట్రైలర్, రౌడీ షీటర్ల నేపథ్యంలో రా & రస్టిక్ కథాంశంతో సాగుతోంది. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఏం జరుగుతుందనే కోణంలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.