బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డకు చెందిన కణితి రామకృష్ణ గత పది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆయన గ్రామీణ ఉపాధి హామీ పథకం (EGS)లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు మొదట భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, రామకృష్ణకు కిడ్నీ మరియు లివర్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ని ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయన అత్యవసర చికిత్స పొందుతున్నారు.
ఈ శస్త్రచికిత్స కోసం సుమారు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలియక రామకృష్ణ భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రామకృష్ణ కుటుంబంలో గతంలోనే విషాదాలు చోటుచేసుకున్నాయి. ఆయన తల్లి కణితి లక్ష్మి అనారోగ్యంతో మరణించగా, చర్లలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన సోదరుడు గత ఏడాది డెంగ్యూ జ్వరంతో హైదరాబాద్‌లో మృతిచెందారు.
ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో, కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 6300229803 నంబర్‌కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపాలని వారు కోరుతున్నారు.








