తమిళ హీరో కార్తీ, లేడీ సూపర్ స్టార్ త్రిష మళ్లీ కలిసి నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కార్తీ నటిస్తున్న 31వ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కి మొదటి ఛాయిస్‌గా నయనతార పేరు వినిపిస్తుండగా, ఒకవేళ ఆమె డేట్స్ కుదరకపోతే త్రిషను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇప్పటికే కార్తి, త్రిష.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ ‘పొన్నియిన్ సెల్వన్’లో జంటగా నటించారు. కార్తి వల్లవరాయన్ వందియదేవన్‌గా, త్రిష కుందవైగా కనిపించారు.

రెండు భాగాల్లోనూ వీరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.