సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి చాందిని చౌదరి స్పందించారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె తాజాగా పంచుకున్నారు.
2015లో ఒక బ్రాండ్ అంబాసిడర్ అవకాశం ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశారని చాందిని తెలిపారు. ఆ సమయంలో సదరు వ్యక్తి తనను కమిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఆ ప్రతిపాదనను తాను వెంటనే తిరస్కరించానని ఆమె చెప్పారు.
తాను తిరస్కరించినందుకు ఆ వ్యక్తి తన తల్లికి ఫోన్ చేసి అవమానించారని చాందిని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తనపై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారని ఆమె పేర్కొన్నారు. తనకు పొగరు ఎక్కువనే ముద్ర వేయడం ఇప్పటికీ తనను ఇబ్బంది పెడుతోందని ఆమె వివరించారు.








