కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'The India Story' సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం కేవలం ₹18 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది.
సినిమాకు ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో, పలు థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని తొలగించారు. సినిమా ప్రమోషన్ కోసం కాజల్ అగర్వాల్ వివిధ వేదికలపై ఎంతో కష్టపడి ప్రచారం చేసినప్పటికీ, ఫలితం మాత్రం దక్కలేదు.
కాజల్ కెరీర్‌లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా ఫలితంతో కాజల్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. నందమూరి బాలకృష్ణతో కలిసి నటిస్తున్న 'NBK111' సినిమాపైనే ఆమె ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు.







