శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా 'వెల్కమ్ టు వైల్డ్ లైఫ్' పోస్టర్ విడుదల చేశారు. చేతిలో సింహం పిల్లని పట్టుకున్న శివరాజ్ కుమార్ ఫోటోలో ప్రత్యేకంగా కనిపించారు.

ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. 'నిను వీడని నీడను నేనే', 'సింగిల్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఇది అతని కొత్త ప్రయోగం.

KVK Productions బ్యానర్ కింద నిర్మాత కుడిపూడి విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు.